Google Pay: గూగుల్ పే ద్వారా నగదు బదిలీ చేసే వారు ఓ సారి ఈ వార్తను చదవండి 

Technology Published On : Thursday, January 7, 2021 03:00 PM

డిజిటల్ చెల్లింపుల్లో దూసుకుపోతున్న గూగుల్ పే వినియోగదారులకు నిరాశాకరమైన వార్తను అందించింది. వచ్చే ఏడాది జనవరి నుండి గూగుల్ పే వెబ్​యాప్ ( Google Pay web app) సేవలను నిలివేయనున్నట్లు తెలిపింది. దీంతో పాటు గూగుల్ పే (Google Pay) నుండి తక్షణ నగదు బదిలీ చేసినందుకు గాను ఛార్జీలు వసూలు చేసే యోచనలో గూగుల్ పే ఉన్నట్లు తెలుస్తోంది. 2021 ప్రారంభం నుంచి మీరు ఇతర వ్యక్తుల నుండి డబ్బు పంపించడానికి, స్వీకరించడానికి pay.google.comను ఉపయోగించలేరు. కాబట్టి ఇక నుండి కొత్త గూగుల్ పే యాప్ ను ఉపయోగించండి" అని కంపెనీ అమెరికా ప్రజలకు సమాచారం ఇచ్చింది. 

గూగుల్ పే వినియోగదారులు ఇప్పటి వరకు డబ్బులు పంపించడానికి గూగుల్ పే యాప్ లేదా గూగుల్ పే వెబ్ ను ఉపయోగించే వారు. గూగుల్ పే వెబ్​ యాప్​లో.. పీర్​-టూ-పీర్ పేమెంట్​ సదుపాయాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి అమెరికాలో నిలిపేసేందుకు సిద్ధమైంది. మొబైల్ యాప్ సేవలు మాత్రం కొనసాగనున్నాయి. దీనితో పాటు తక్షణ నగదు బదిలీకి ఛార్జీలు కూడా అమెరికాలో ఉన్న వినియోగదారులకు మాత్రమేనని భారత యూజర్లకు కాదని తెలిపింది. 

ఐఓఎస్​, ఐఓఎస్​ యూజర్లకు గూగుల్ పే సరికొత్త ఫీచర్లను ఇటీవలే పరిచయం చేసింది. తొలుత అమెరికాలోని వినియోగదారులకు ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్లు అందించి.. మిగతా యూజర్లకు ఇటీవలే ఈ ఫీచర్లను తీసుకొచ్చింది.