LG New Smart Phones: LG నుంచి బడ్జెట్ ధరలో మూడు స్మార్ట్ ఫోన్లు
దక్షిణ కొరియా దిగ్గజం LG సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకురానుంది. W11, W31, W31 ప్లస్ స్మార్ట్ ఫోన్లను త్వరలో విడుదల చేయనుంది. గత ఏడాది లాంచ్ చేసిన W10, W30 సిరీస్‌లకు కొనసాగింపుగా ఇప్పుడు W11, W31 మోడళ్లను ఆ సంస్థ ప్రకటించింది. W31ప్లస్ స్మార్ట్‌ఫోన్ చూడటానికి W31 మాదిరిగానే ఉంటుంది. కానీ దీని స్టోరేజీ 128GB వరకు ఉంటుంది. ఈ మూడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఒకే స్క్రీన్ సైజు, ప్రాసెసర్, బ్యాటరీ సామర్థ్యంతో మార్కెట్లోకి రానున్నాయి.
మోడల్‌ను బట్టి ధరలు
W11 స్మార్ట్‌ఫోన్ 3 జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్ వేరియంట్‌తో లభించనుంది. దీని ధర రూ .9,490. W31 మోడల్ 4 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ ఆప్షన్తో లభిస్తుంది. దీని ధర రూ.10,990. W31 ప్లస్ 4 జీబీ ర్యామ్ వేరియంట్ రూ.11,990కు లభించనుంది. ఈ మూడు ఫోన్లూ 6.52 అంగుళాల డిస్‌ప్లే, HD+ రిజల్యూషన్, వాటర్‌డ్రాప్ నాచ్‌తో అందుబాటులోకి రానున్నాయి. వీటికి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. W11 స్మార్ట్‌ఫోన్ 3GB RAM, మీడియాటెక్ హెలియో చిప్‌సెట్తో లభించనుంది. W31, W31 ప్లస్ మోడళ్లలో 4GB RAM ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనున్నాయి. స్టోరేజ్‌ను పెంచుకోవడానికి మైక్రో SD కార్డ్ స్లాట్ ఆప్షన్ కూడా ఉంటుంది.
కెమెరా సామర్థ్యం
LG W11 డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌తో లభిస్తుంది. దీంట్లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. W31, W31 ప్లస్ ఫోన్లలో మూడు రియర్ కెమెరాలు ఉంటాయి. వీటిల్లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2-మెగాపిక్సెల్ షూటర్ కెమెరాలు ఉన్నాయి. మూడు స్మార్ట్‌ఫోన్‌లు హెడ్‌ఫోన్ జాక్‌తో లభిస్తాయి. W31, W31 ప్లస్ స్మార్ట్‌ఫోన్లకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ కూడా ఉంటుంది.