జనవరి 1 నుంచి వాట్సాప్ పనిచేయదు

Technology Published On : Tuesday, December 24, 2024 01:53 PM

ఆన్లైన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ జనవరి 1, 2025 నుంచి కొన్ని ఫోన్లలో పనిచేయదని వాట్సాప్ మాతృ సంస్థ మెటా ప్రకటించింది. ఇప్పటికే చాలా మంది యూజర్లు ఆండ్రాయిడ్ పాత వెర్షన్ ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టంతోనే వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. దాంతో వాట్సాప్ అప్ డేట్లు ఆయా ఫోన్లలో పనిచేయడం లేదని వాట్సాప్ పేర్కొంది. మెరుగైన సర్వీసులు మరియు భద్రత అందించేందుకు మెటా అందిస్తున్న అప్ డేట్లను పాత ఆపరేటింగ్ సిస్టం ఉన్న ఫోన్లు అందుకోలేకపోతున్నాయని స్పస్టం చేసింది.

భవిష్యత్తులో కొన్ని భద్రతా కారణాల వల్ల కొన్ని ఫోన్లలో వాట్సాప్ నిలిపివేస్తున్నట్లు మెటా తెలిపింది. జనవరి 1, 2025 నుంచి వాట్సాప్ పనిచేయని డివైజులు/ఫోన్ల వివరాలను మెటా సంస్థ ప్రకటించింది. మరియు ఇందులో మీ ఫోన్ ఉందో లేదు చూసుకోండి.

సాంసంగ్: గెలాక్సీ ఎస్3, గెలాక్సీ నోట్ 2, గెలాక్సీ ఏస్ 3, గెలాక్సీ ఎస్4 మినీ
మోటరోలా: మోటో జి (1వ జనరేషన్), రేజర్ హెచ్‌డీ, మోటో ఈ 2014
హెచ్‌టీసీ:  వన్ ఎక్స్, వన్ ఎక్స్+, డిజైర్ 500, డిజైర్ 601
ఎల్‌జీ: ఆప్టిమస్ జీ, నెక్సస్ 4, జీ 2 మినీ, ఎల్ 90
సోనీ:  ఎక్స్‌పీరియా జెడ్, ఎక్స్‌పీరియా ఎస్‌పీ, ఎక్స్‌పీరియా టీ, ఎక్స్‌పీరియా వీ

ఆండ్రాయిడ్‌తోపాటు యాపిల్‌ ఓఎస్‌ ఇన్‌స్టాల్‌ అయిన కొన్ని పరికరాల్లోనూ వాట్సప్‌ పని చేయదని మెటా తెలిపింది. అయితే అందుకు మే 5 వరకు గడువు ఉందని పేర్కొంది. జనవరి నుంచి ఐదు నెలల నోటీస్‌ పీరియడ్‌ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఐఓఎస్‌ 15.1 వర్షన్‌ కంటే ముందున్న ఓఎస్‌లు వాడుతున్న డివైజ్‌ల్లో వాట్సప్‌ పనిచేయదని కంపెనీ తెలిపింది. కంపెనీ వివరాల ప్రకారం ప్రధానంగా ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్ వాడుతున్న వినియోగదారులపై ఈ ప్రభావం పడుతుంది.

మేఘ శుక్లా హాట్ ఫోటోలు.. నిజంగానే హీరోయిన్ మెటీరియల్ భయ్యా

See Full Gallery Here...