వాట్సాప్ లో కొత్త ఫీచర్లు
ఆండ్రాయిడ్, IOS యూజర్లకు వాట్సాప్ కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఇక నుంచి గ్రూపు సభ్యుల్లో ఎంత మంది ఆన్లైన్లో ఉన్నారో నంబర్ రూపంలో (EX: 5 Online) కనిపిస్తుంది. దాంతో పాటు గ్రూపులో ప్రతీ మెసేజ్ కు కాకుండా మనల్ని ఎవరైనా మెన్షన్ చేస్తే లేదా మన మెసేజ్ కు రిప్లై ఇస్తే మాత్రమే నోటిఫికేషన్ వచ్చేలా మరో ఫీచర్ ను తీసుకొచ్చింది. అటు ఐఫోన్లలో డాక్యుమెంట్లను స్కాన్ చేసి పంపించే ఆప్షన్ కూడా యాడ్ చేసింది.