మీ ఫోన్ రేడియేషన్ ఎంతో ఇలా తెలుసుకోండి..
మనం వాడే మొబైల్ ఫోన్ల నుంచి రేడియేషన్ విడుదలవుతుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే మన ఫోన్ ఎంత రేడియోషన్ విడుదల చేస్తుందనేది తెలియకపోవచ్చు. దీనిని SAR(స్పెసిఫిక్ అబ్జార్షన్ రేటు) ద్వారా నిర్ణయించవచ్చు. అది మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు.
మీ ఫోన్ డయల్ పాడ్ లో #07# ను ఎంటర్ చేయడం ద్వారా ఈ SAR తెలుసుకోవచ్చు. మన దేశంలో మొబైల్ ఫోన్ల నుంచి విడుదలయ్యే SAR లిమిట్ 1.6W/kg వరకు ఉంది. ఆ విలువ దాటితే మీ ఫోన్ నుండి అధిక రేడియేషన్ విడుదల అవుతోందని అర్థం.