గూగుల్ పే వాడే వారికి బిగ్ షాక్..!
యుపిఐ యాప్ గూగుల్ పే యూజర్లకు షాకిచ్చింది. తమ యాప్ ద్వారా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులతో చేసే చెల్లింపులపై కన్వీనియన్స్ ఫీజు వసూలు చేస్తోంది. లావాదేవీ విలువను బట్టి ఇకపై గ్యాస్, పవర్ సహా ఏ బిల్లులైనా పై కార్డులతో చెల్లిస్తే 0.5 శాతం నుండి 1 శాతం వరకు ఫీజు వసూలు చేయనుంది.
అయితే UPI లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ల ద్వారా నేరుగా చెల్లిస్తే ఎలాంటి ఫీజు ఉండదు. ఏడాది క్రితం నుంచి మొబైల్ రీఛార్జీలపై గూగుల్ పే రూ.3 వరకు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే.