చైనా యాప్ పై అమెరికా నిఘా
చైనా AI యాప్ DeepSeek పై అమెరికా నిఘా పెట్టింది. అమెరికా జాతీయ భద్రతపై DeepSeek చూపే ప్రభావాలను పరిశీలిస్తున్నట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. DeepSeek వృద్ధిలో ప్రాపర్టీ థెఫ్ట్ జరిగి ఉండవచ్చని డొనాల్డ్ ట్రంప్ AI, క్రిప్టో సలహాదారు డేవిడ్ సాక్స్ అనుమానించారు.
Alలో 'డిస్టిలేషన్' అనే టెక్నిక్ ఉందని, దీని ద్వారా ఒక AI మోడల్ మరొక మోడల్ నుంచి నేర్చుకుంటుందని తెలిపారు. అదే DeepSeek విజయానికి కారణం కావచ్చని సందేహం వ్యక్తం చేస్తున్నారు.