అమెజాన్ లో ఉచితంగా దొరికే వస్తువులు ఏంటో తెలుసా ?
ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్ లో ఏ వస్తువులు అయినా ఉచితంగా లభించేవి ఉన్నాయా అని చాలామంది తెగ వెతికేస్తుంటారు. అలాంటి వారికోసం అమెజాన్ కొన్ని ఉచితంగా అందిస్తోంది. కొన్ని రకాల వస్తువులు మీరు ఎటువంటి పైకం చెల్లించకుండానే అమెజాన్ నుండి తీసుకోవచ్చు. అయితే దీని కోసం మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది. వారికి మాత్రమే ఇవి ఉచితంగా లభిస్తాయి. ఏడాదికి 99 డాలర్లతో సభ్యత్వం తీసుకోవాలి. అలాగే మీకు 30 రోజుల ట్రయల్ కూడా ఉచితంగా లభిస్తుంది. ఇక మీరు స్టూడెంట్లు అయితే మీకు Prime Student కింద ఆరునెలల ఉచిత సభ్యత్వం లభిస్తుంది. ఉచితంగా లభించే వాటిపై ఓ లుక్కేయండి.
Download and Stream Free Music: ఇందులో దాదాపు 10 వేలకు పైగా ఎంపీ3లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితంగా ఎటువంటి లిమిట్ లేకుండా మీకు అందుతుంది. ఇందులో మీకు నచ్చిన రకరకాల పాటలను పూర్తిగా ఆస్వాదించవచ్చు. 2 మిలియన్ పాటలు ఇక్కడ ఉన్నాయి.
Read Free Kindle eBooks:టాప్ 100 రచయితల బుక్స్ మీకు ఇక్కడ పూర్తి ఉచితంగా లభిస్తాయి. అయితే ఈ ఆఫర్ లిమిట్ లో మాత్రమే ఉంటుంది. ప్రైమ్ మెంబర్ షిప్ గల సభ్యులు 1000కి పైగా పుస్తకాలను ఇందులో చదువుకునే అవకాశం ఉంది.
Watch Free Movies and TV Shows: వేయికి పైగా సినిమాలో ఇందులో ఉన్నాయి. ఇవి పూర్తి ఉచితంగా లభిస్తాయి. అలాగే టీవీషోలు కూడా ఉచితంగా చూడవచ్చు. అయితే ఇవన్నీ ఆస్వాదించాలంటే ప్రైమ్ మెంబర్ షిప్ ఉండి తీరాలి.
Get Free Shipping: మీరు ఏదైనా అమెజాన్లో కొనుగోలు చేస్తే మీకు ఉచితంగా డెలివరీ అందుతుంది. మీరు కొనుగోలు చేసే మొత్తంతో సంబంధం లేకుండా మీకు ఉచితంగా డెలివరీ చేసే సౌకర్యం పూర్తి ఉచితంగా లభిస్తుంది.
Gift Cards, Sample Boxes Get Free Amazon Credits and Gift Cards మీరు ఉచితంగా గిఫ్ట్ కార్డులు అందుకోవచ్చు. Order Free Sample Boxes మీకు అమెజాన్ బాక్సులు కావాలంటే పూర్తి ఉచితంగా ఆర్డర్ చేయవచ్చు. దీనికి మీరు ఎలాంటి రుసుం చెల్లించనవసరం లేదు.
Free Audio Books : ఆడియో బుక్స్ కూడా మీకు పూర్తి ఉచితంగా లభిస్తాయి. మీరు బుక్స్ చదివే తీరిక లేకుండా ఆడియో బుక్స్ వినవచ్చు. మీరు ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు ముందుగా చూసేది ఆ వస్తువు రివ్యూనే కదా..ఇది మీకు పూర్తి ఉచితంగా అమెజాన్లో లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ మెబర్లకు ఫోటోలను స్టోర్ చేసుకునేందుకు అన్ లిమిటెడ్ స్పేస్ ని అందిస్తోంది. మీకు మొత్తంగా 5జిబి స్టోరేజిని అమెజాన్ ఉచితంగా అందిస్తోంది.