వాట్సాప్ లో కీలక మార్పులు, కొత్త ఫీచర్

Technology Published On : Saturday, March 1, 2025 09:00 AM

వాట్సాప్ వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ ఫీచర్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాట్సాప్ త్వరలో మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. కంపెనీ తన చెల్లింపు వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు, యూజర్ల సౌలభ్యం కోసం యాప్‌కు UPI లైట్ ఫీచర్‌ను కూడా జోడించాలని యోచిస్తోంది. 

వాట్సాప్ UPI లైట్ ఫీచర్ యాప్‌కు జోడించిన తర్వాత ఈ కొత్త ఫీచర్ Google Pay, Paytm, PhonePe వంటి యాప్‌లతో పోటీ పడనుంది. యూపీఐ లైట్ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్ v2.25.5.17 లో కనిపించింది. ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ స్థిరమైన అప్‌డేట్‌ వినియోగదారులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఆ సంస్థ ఇంకా ప్రకటించలేదు.