నేడు ఈ జిల్లాల వారు జాగ్రత్త..!
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. 670 మండలాల్లో వేడిగాలులు వీస్తాయని అత్యధికంగా ప్రకాశం, నెల్లూరు, కడప, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీకాకుళం జిల్లాల్లోని 30కి పైగా మండలాల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. అలాగే అల్లూరి జిల్లాలోని చింతూరు, కూనవరం మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కావొచ్చని తెలిపింది.