అలెర్ట్: నేడు ఈ మండలాల వారు చాలా జాగ్రత్త
ఏపీలోని 47 మండలాల్లో ఈ రోజు (గురువారం) తీవ్ర వడగాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ (APSDMA) వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లాలోని 13, విజయనగరం జిల్లాలో 14, మన్యం జిల్లాలో 11, అనకాపల్లి జిల్లాలో 2, కాకినాడ జిల్లాలో 4, తూర్పుగోదావరి జిల్లాలో 2, ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని అంచనా వేసింది.
బుధవారం వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటంలో అత్యధికంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. కమ్మరచేడులో 40.7 డిగ్రీలు, నిండ్రలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది.