హెచ్చరిక: వారు బయటికి రాకండి..
ఏపీలో 3 నెలలపాటు ఎండలు, వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని APSDMA హెచ్చరించింది. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాని వెల్లడించింది.
గర్భిణులు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, బయటికెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. డీహైడ్రేట్ కాకుండా నీళ్లు, మజ్జిగ, కొబ్బరి, లెమన్ వాటర్ తాగాలని సలహా ఇచ్చింది. ఎండలపై సమాచారం కోసం 112, 1070, 18004250101 నంబర్లను సంప్రదించాలని కోరింది.