ఈ సారి మండిపోనున్న బెంగళూరు
దేశంలో ఈసారి ఎండలు మండిపోతాయని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యంత వేడి నగరంగా (హాస్టెస్ట్ సిటీగా) బెంగళూరు నిలవనుందని IMD అంచనా వేసింది.
ఏటా వేసవిలో ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయని, అయితే ఈసారి ఢిల్లీ కంటే బెంగళూరులోనే రికార్డ్ స్థాయి టెంపరేచర్ నమోదవుతుందని వెల్లడించింది. సిలికాన్ సిటీలో ఇవాళ 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా, ఢిల్లీలో 27 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదవడం గమనార్హం.