ఏపీలో ఉన్నారా? వచ్చే రెండ్రోజులు జాగ్రత్త..!
ఏపీలో వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. పగటి ఉష్ణోగ్రతలు 2 నుండి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వేడి వాతావరణం నెలకొందని, నిన్న పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-5 డిగ్రీలు ఎక్కువగా రికార్డయినట్లు పేర్కొంది.
కృష్ణా జిల్లా నందిగామలో వరుసగా ఐదో రోజు అత్యధికంగా 37.6 డిగ్రీలు నమోదైంది. వివిధ ప్రాంతాలలోనూ అదే మాదిరి ఉష్ణోగ్రతలు పెరిగాయి. మరో రెండ్రోజులు ఎండ వేడికి జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.