అలెర్ట్: నేడు చాలా జాగ్రత్తగా ఉండండి

Weather Published On : Saturday, April 12, 2025 08:08 AM

శనివారం కృష్ణా జిల్లా గన్నవరం, కంకిపాడు, పెదపారుపూడి, ఉంగుటూరు, ఉయ్యూరు మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే 61 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. అల్లూరి-1, కాకినాడ-6, కోనసీమ-8, తూర్పుగోదావరి-3, పశ్చిమగోదావరి-1

ఏలూరు-7, కృష్ణా-9, ఎన్టీఆర్-4, గుంటూరు-14, బాపట్ల-7, ప్రకాశం-1 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఆదివారం 10 మండలాల్లో తీవ్ర, 108 మండలాల్లో వడగాలులు వీచేందుకు అవకాశం ఉందన్నారు. శుక్రవారం వైఎస్సార్ జిల్లా అట్లూరులో 41.4°C, ప్రకాశం జిల్లా గుంటుపల్లిలో 41.2°C, నంద్యాల జిల్లా దొర్నిపాడు, పల్నాడు జిల్లా రావిపాడు 40.9°C, నెల్లూరు జిల్లా అయ్యపరెడ్డిపాలెంలో 40.7°C, ఏలూరు జిల్లా కామవరపుకోట, చిత్తూరు జిల్లా తవణంపల్లె లో 40.6°C, బాపట్ల జిల్లా వల్లపల్లిలో 40.5°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు.25 ప్రాంతాల్లో 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు తెలిపారు. ఎండతీవ్రంగా ఉండి బయటకు వెళ్లేప్పుడు తలకు టోపి, కర్చీఫ్ కట్టుకోవాలి, గొడుగు ఉపయోగించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని సూచించారు. ఆకస్మాతుగా పిడుగులతో పడే వర్షాలు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...