నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం
భారత వాతావరణ శాఖ (IMD) ఎనిమిది రాష్ట్రాలకు భారీ వర్షపాతం హెచ్చరిక జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్లకు ఈరోజు వేడిగాలుల హెచ్చరిక జారీ చేసింది.
ఆంధ్ర, తెలంగాణలో రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. అలాగే పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు.