వారం రోజులు వానలే.. వానలు
ఏపీలో నేటి నుంచి ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో ఐదు రోజులపాటు ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా సాధారణ వాతావరణం కంటే రెండు డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు.