నేడు, రేపు కూడా అదే వాతావరణం
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది.
అటు ఆంధ్ర ప్రదేశ్ లోనూ రానున్న మూడు రోజుల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. అలాగే పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు.