2 తుఫానులు.. 3 వాయుగుండాలు.. 3 అల్పపీడనాలు..
దక్షిణ భారతదేశం నుంచి ఈశాన్య రుతుపవనాలు సోమవారం నిష్క్రమించాయి. వాస్తవానికి 10 రోజుల ముందే ఈ ప్రక్రియ పూర్తవ్వాల్సి ఉండగా వాతావరణ మార్పులతో కాస్త ఆలస్యమైంది. ఈ సీజన్ లో మొత్తంగా 2 తుఫాన్లు, 3 వాయుగుండాలు, 3 అల్పపీడనాలు వచ్చాయి.
దక్షిణ భారతదేశంలోకి అక్టోబర్ 15న రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ సీజన్లో ఆంధ్రపదేశ్ లో 286.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 10 శాతం అధికంగా 316.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాయలసీమలో 46 శాతం అధిక వర్షపాతం రికార్డయింది, ఉత్తర కోస్తాలో తక్కువ వర్షం కురిసింది.