నేడు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని, ఆ తర్వాత క్రమంగా 2 నుండి 3 డిగ్రీల మేర పెరుగుతాయని ప్రకటించింది.