నేడు ఆ జిల్లాల్లో వర్షాలు
బంగాళాఖాతంలో విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది.
అదే సమయంలో 19 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు, ఉపరితల ద్రోణి వల్ల నిన్న తమిళనాడుతో పాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడిన విషయం తెలిసిందే. రాయలసీమలోని మిగతా ప్రాంతాల్లో పాక్షికంగా మేఘాలు ఆవరించి కనిపించాయి.