నేడు కూడా పిడుగులతో కూడిన వర్షాలు
ఉత్తరాంధ్రలో ఆదివారం పిడుగులతో కూడిన వర్షాలు, కాకినాడ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. అదే సమయంలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందని తెలిపింది.
శనివారం పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసినట్లు ప్రకటించింది. కాకినాడ జిల్లా వేలంకలో 56.2mm, ఏలేశ్వరంలో 48.5, కోటనందూరులో 45.2, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 44.5, 33 ప్రాంతాల్లో 20 మిల్లీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు తెలిపింది.