నేడు వాతావరణం ఎలా ఉంటుందంటే..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రాబోయే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకు వర్ష సూచన ఉంది.
నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు, నిన్న రాత్రి 8 గంటల వరకు మన్యం జిల్లా పెదమేరంగిలో 47.5 మి.మీ. వర్షం పడగా, నంద్యాల జిల్లా దొర్నిపాడులో 41.6°C ఉష్ణోగ్రత నమోదైంది.