ఉద్యోగి పేరుతో కారు విడుదల చేసిన టాటా

Friday, December 20, 2024 10:23 PM Automobiles
ఉద్యోగి పేరుతో కారు విడుదల చేసిన టాటా

ఇండియన్ మార్కెట్లో టాటా సుమో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాటా సుమో అంటే తెలియని వారు అస్సలు ఉండరు. ఒకప్పుడు సినిమాల్లో ఛేజింగ్ సీన్లు పండించాలన్నా, గాల్లోకి ఎగిరించాలన్నా టాటా సుమోలు ఉండాల్సిందే. అవే సుమోలు లేకపోతే 90 చివర్లో, 20 ప్రారంభపు దశకాల్లో వచ్చిన సినిమాలో ఏమయ్యేవో. సినిమాలే కాదు.. అప్పట్లో టాటా సుమో అంటే ఇష్టపడని వారుండరు.

మరి ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న టాటా సుమో వాహనానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. టాటా సంస్థలో పని చేసే ఒక ఉద్యోగి పేరునే ఈ వాహనానికి సుమో అని నామకరణం చేశారని తెలుసా..? అస్సలు ఒక ఉద్యోగి పేరును ఈ వాహనానికి పెట్టారో చూద్దాం రండి.

ప్రతిరోజు టాటా మోటార్స్ లో పనిచేసే పెద్దపెద్ద అధికారులందరూ కలిసి మధ్యాహ్న సమయంలో భోజనాలు చేస్తూ కంపెనీ విషయాలే కాక అనేక ఇతర రాజకీయ వ్యవహారాలు మాట్లాడుకుంటూ ఉండేవారు.

కానీ, కొన్ని రోజులనుండి సుమంత్ మోలగోకర్ అనే ఆయన వీళ్ళతో కలవకుండా తన కారు తీసుకుని బయట భోజనం చేయటానికి వెళ్ళటం చూసి, ఆ అధికారులు అతనిని ” ఈయన డీలర్లు ఎవరో పెద్ద ఖరీదైన హోటళ్ళలొ ఇచ్చే పార్టీలు మరిగాడు" అనే అపవాదు వెయ్యటం సాగించారు.
ఒకరోజు కొందరు అధికారులు ఆయనను రహస్యంగా వెంబడించి అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు.

ఆయన కారుతో వెళ్ళి , రోడ్డు వెంబడి "ధాబా" దగ్గర కారు ఆపి, అక్కడ భోజనం చేస్తున్నాడు. అలా భోజనం చేస్తూ, టాటా మోటార్సు వారి తయారు చేసే ట్రక్ లు వాడే డ్రైవర్లతో సంభాషణ చేస్తూ, టాటా వాహనాలలోని బాగోగుల గురించి వారితో చర్చిస్తూ, ఆ విషయాలు తన పుస్తకంలో వ్రాసుకుంటూ, టాటా వాహనాల ఉత్పత్తి నాణ్యతను పెంచే దిశగా ఎంతో విషయసేకరణ చేశాడు. అలా ఆ డైవర్లు చెప్పిన విషయాలతో టాటా వాహానాల నాణ్యతను పెంచి, వాటిని ప్రపంచంలోనే ఉన్నతికి తీసుకు వచ్చాడు శ్రీ సుమంత్ మోలగోంకర్. ఆయన చేసిన సేవకు టాటా మోటార్స్ ఆయన పేరున " టాటా సుమో " వాహనానికి ఆయన పేరు పెట్టారు. సు అంటే సుమంత్, మో అంటె మోలగోంకర్. ప్రపంచంలో ఉద్యోగికి ఒక కంపెనీ ఇచ్చిన అత్యున్నత గౌరవం ఇది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: