భారత్ లో టెస్లా మొదటి షో రూం.. ఎక్కడంటే..?
Saturday, March 1, 2025 02:00 PM Business

టెస్లా భారత్ కు మరింత చేరువవుతూ కొత్త షో రూం ప్రారంభించనుంది. ముంబై బాంద్రాకుర్లా కాంప్లెక్స్ షోరూమ్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఓ కమర్షియల్ కాంప్లెక్సులోని అండర్ గ్రౌండ్ లో 4000 చదరపు అడుగుల స్థలాన్ని ఐదేళ్లు లీజుకు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఒక చదరపు అడుగుకు రూ.900 చొప్పున నెలకు రూ.35లక్షల లీజు చెల్లించనుంది. రెండో షోరూమ్ను ఢిల్లీలోని ఏరోసిటీ కాంప్లెక్స్లో ప్రారంభించనున్నట్లు సమాచారం. టెస్లా ఇప్పటికే ఉద్యోగుల నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: