23 మంది.. 7 రోజులు.. బాలికపై కీచక పర్వం

Wednesday, April 9, 2025 11:00 AM Crime
23 మంది.. 7 రోజులు.. బాలికపై కీచక పర్వం

సీనియర్ ఇంటర్ చదువుతున్న ఓ బాలికపై 23 మంది మానవ మృగాలు కీలక పర్వాన్ని కొనసాగించారు. అది కూడా ఏకంగా 7 రోజుల పాటు ఆ దుర్మార్గులు బాధిత బాలికపై అతి కిరాతకంగా వ్యవహరించారు. ఈ దారుణ ఘటన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో చోటు చేసుకుంది. 

వారణాసిలోని పిశాచిమోచన్ ప్రాంతంలోని ఓ హుక్కా సెంటర్ కు బాదిత బాలికను గత నెల 29న ఆమె స్నేహితురాలు తీసుకెళ్లింది. బాధిత బాలికకు మత్తు కలిపిన పానీయం ఇచ్చిన కొందరు ఆమె స్పృహ తప్పగానే తమ వెంట తీసుకెళ్లారు. మొత్తం 23 మంది యువకులు బాధిత బాలికను నగరంలోని శిగ్రా ప్రాంతంలోని పలు హోటళ్లకు తిప్పుతూ తమ కీచక పర్వాన్ని కొనసాగించారు. మత్తు నుంచి మేల్కొన్న బాలిక ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరింది. అప్పటికే తమ కూతురు కోసం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాథిత కుటుంబం తమ కూతురు తిరిగి వచ్చిందని తెలిపింది. తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాధిత బాలిక సవివరంగా పోలీసులకు వివరిస్తూ ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారానికి పాల్పడ్డ వారిలో 12 మంది తనకు తెలిసినవారేనని, మిగిలిన వారు తెలియదని తెలిపింది. దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. 

దర్యాప్తులో భాగంగా మరింత మేర సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ విషయాన్ని కాస్తంత సీరియస్ గా తీసుకున్న వారణాసి పోలీసులు నిందితుల కోసం వెనువెంటనే వేట మొదలు పెట్టారు. సోమవారం నాటికే ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపడుతున్నారు. బాలిక గుర్తించిన 12 మందిలో ఆమెతో కలిసి చదువుతున్న బాలురు కూడా ఉన్నారు. బాలిక గుర్తు పట్టని నిందితుల కోసం పోలీసులు ఇప్పటికే హుక్కా సెంటర్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. అంతేకాకుండా హుక్కా సెంటర్ సీసీటీవీ ఫుటేజీతో పాటు బాలికను తిప్పిన హోటళ్లు, ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: