స్నేహితురాలైన నటిని షాప్ ప్రారంభోత్సవానికి పిలిపించి.. వ్యభిచారం చేయాలని ఒత్తిడి..

Tuesday, March 25, 2025 01:00 PM Crime
స్నేహితురాలైన నటిని షాప్ ప్రారంభోత్సవానికి పిలిపించి.. వ్యభిచారం చేయాలని ఒత్తిడి..

స్నేహితురాలైన నటిని షాప్ ప్రారంభోత్సవానికి పిలిపించి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసిన ఘటన హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ లో చోటు చేసుకుంది. సీఐ పరుశురాం తెలిపిన వివరాల మేరకు.. వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి చెందిన ఓ యువతి గత నాలుగు సంవత్సరాలుగా ముంబైలో ఉంటూ సీరియల్ నటిగా పని చేస్తుంది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన గాయత్రి హైదరాబాదులోని ఓ బట్టల షాపును ప్రారంభించడానికి ఓ సినీ నటిని పంపించండి అంటూ ముంబైలోని మిత్రుడు పంకజ్ ను కోరింది.

అతడు ఆ నటిని షాప్ ఓపెనింగ్ కోసం ఈ నెల 18న హైదరాబాద్ కు పంపించాడు. గాయత్రితో పాటు తన మిత్రురాలైన మరో మహిళతో కలిసి మాసబ్ ట్యాంక్ లోని ఓ అపార్ట్మెంట్ లో బస చేసేందుకు ఏర్పాటు చేశారు. 21న రాత్రి 9 గంటల ప్రాంతంలో గాయత్రి తో పాటు ఇద్దరు మహిళలు కలిసి సినీనటి రూమ్ కు వచ్చి ముగ్గురు వ్యక్తులతో వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశారు.

ఆ క్రమంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో ముగ్గురు పురుషులు నటి ఉన్న గదిలోకి ప్రవేశించి తమతో గడపాలని ఒత్తిడి చేశారు. నటి నిరాకరించడంతో ఆమెపై దాడి చేశారు. ఆమె గట్టిగా అరిచి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఇద్దరు మహిళలు నటిని గదిలో బంధించి, కొంత నగదుతో అక్కడి నుంచి పరారయ్యారు. సినీనటి వెంటనే 100కు ఫోన్ చేయడంతో వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని బందీగా ఉన్న నటిని విడిపించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: