దత్తత తీసుకున్న కొడుకుని పెళ్లి చేసుకున్న మహిళ. నెటిజనుల చివాట్లు
వరైనా సరే అనాథ పిల్లలను దత్తత తీసుకోవడం చాలా పుణ్య కార్యంగా పరిగణిస్తారు. అనాథ పిల్లలను దత్తత తీసుకుని సొంత పిల్లల్లా పెంచి, చదువులు నేర్పించి, సమర్ధులుగా తీర్చిదిద్దే వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు.
అయితే రష్యాలో వెలుగులోకి వచ్చిన ఓ ఉదంతం ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ విషయం తెలిసి కూడా జనాలు నమ్మలేకపోతున్నారు. రష్యాకు చెందిన ఓ మహిళ ఓ పిల్లాడిని దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసుకుంది. మహిళ వయస్సు ప్రస్తుతం 53 సంవత్సరాలు. అయితే ఆ మహిళ వివాహం చేసుకున్న వ్యక్తి వయస్సు 22 సంవత్సరాలు. అంటే ఇద్దరి మధ్య వయస్సు వ్యత్యాసం 31 సంవత్సరాలు. ఆడిటీ సెంట్రల్ అనే వెబ్‌సైట్ కథనం ప్రకారం మహిళ తన సొంత రాష్ట్రం టాటర్‌స్థాన్. ఇక్కడ ఈ వింత వివాహం కలకలం సృష్టించింది. ఈ విషయం తెలిసిన తర్వాత ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఆ మహిళ టాటర్‌స్తాన్‌కు చెందిన ప్రసిద్ధ సంగీత విద్వాంసురాలు. ఐసీలు చిజెవ్‌స్కాయా -మింగలిమ్. నివేదిక ప్రకారం 8 సంవత్సరాల క్రితం అనాధ శరణాలయాల్లో సంగీతం నేర్పుతున్న సమయంలో ఐసిలు 13 ఏళ్ల బాలుడు డేనియల్‌ను కలుసుకున్నాడు. ఐసిలు డేనియల్ అభిరుచిని గుర్తించి అతనికి సంగీతం నేర్పడంలో సహాయం చేసింది.
ఈ సమయంలో డేనియల్ అనేక రియాలిటీ షోల్లో కూడా పాల్గొన్నాడు. అతనికి 14 ఏళ్లు వచ్చినప్పుడు ఐసిలు అతన్ని దత్తత తీసుకున్నది. అప్పటి నుండి వారు సహజీవనం చేస్తున్నారు, అయితే అక్టోబర్ 20 న వీరిద్దరూ చట్టబద్ధంగా ఒకరినొకరు వివాహం చేసుకోవడం ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది.
డేనియల్‌తో తన రిలేషన్‌షిప్ గురించి చాలా కాలంగా పుకార్లు ఉన్నాయని.. అందుకే ఈ పెళ్లితో ఆ పుకార్లన్నింటికీ స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నానని ఐసీలు తెలిపింది. అయితే తమ వివాహానికి నిజమైన అర్ధం వేరని.. తమ వివాహం నిజమైనది కావచ్చు.. కానీ దీనికి ఆధ్యాత్మిక స్వభావం మాత్రమే ఉందని.. భౌతికమైనది కాదని పేర్కొంది.