రైలులో అత్యాచారయత్నం.. కిందకి దూకేసిన యువతి
Monday, March 24, 2025 11:00 AM Crime

హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. MMTS రైలులో ప్రయాణిస్తున్న యువతిపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. అతడి నుంచి తప్పించుకునేందుకు ఆమె రైలు నుంచి కిందకి దూకేసింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. గాయపడిన యువతిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తుండగా కొంపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. మహిళా బోగీలో యువతి ఒక్కరే ఉండటంతో నిందితుడు ఆమెపై అత్యాచారానికి యత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: