నా వల్ల కావట్లేదు.. నేను చనిపోతున్నా
Sunday, February 2, 2025 08:52 AM Crime

నా వల్ల కావట్లేదు.. నేను చనిపోతున్నా అంటూ అమ్మానాన్నలకు లేఖ రాసి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ లో చోటు చేసుకుంది. ఏపీలోని అమలాపురానికి చెందిన యోగిత (15) చిన్నప్పటి నుంచి మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని అమ్మమ్మ వద్ద ఉంటోంది.
పదో తరగతి పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తుండటంతో ఆత్మహత్య చేసుకుంది. పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 'ఎంత చదివినా మార్కులు రావడం లేదు. 10 జీపీఏ సాధించాలనుకుంటున్నా నా వల్ల కావట్లేదు. నేను చనిపోతున్నా. అమ్మానాన్నా క్షమించండి' అని సూసైడ్ నోట్ రాసింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: