కన్న కూతురిని గర్భవతిని చేసిన తండ్రి.. కర్ణాటకలో అమానుషం..

కర్నాటక రాష్ట్ర కోలార్ జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. పెళ్లి ఈడుకు వచ్చిన కూతురిని కన్న తండ్రే గర్భవతిని చేశాడు.
కోలార్ జిల్లా, బంగార్‌పేట తాలూకాలోని ఒక గ్రామంలో. వ్యవసాయ కూలీలుగా, ఇటుకలు కట్టే కార్మికులుగా జీవనం సాగించే దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 11 సంవత్సరాల క్రితం భార్య అనారోగ్యంతో మరణించింది. పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు, పెద్ద కూతురికి 20 సంవత్సరాలు, రెండవ కూతురికి 18 సంవత్సరాలు, చిన్న కూతురికి 16 సంవత్సరాలు.భార్య లేకుండా జీవిస్తున్న ఆ వ్యక్తి తన కామాన్ని తీర్చుకోవడానికి తన సొంత కూతురినే ఉపయోగించుకున్నాడు. తన ఇద్దరు చిన్న పిల్లలు పాఠశాల, కళాశాలకు వెళ్ళినప్పుడు అతను పెద్ద కుమార్తెపై అత్యాచారం చేశాడు. ఆమెకు వివాహం చేసి జీవితాన్ని ఇవ్వాల్సిన తండ్రి వల్లే ఆమె జీవితం నాశనం కావడం చూసి ఎవరిని న్యాయం అడగాలో తెలియక కొన్ని రోజులు భరించింది.
ఆమె ఇప్పుడు ఐదు నెలల గర్భవతి. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కామసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన తండ్రిని అరెస్టు చేశారు. ఈ విషయంపై పోలీసులు తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.