ప్రియుడికి విషమిచ్చి చంపిన యువతికి మరణశిక్ష.. వీటి.ఆధారంగానే తీర్పు..

Monday, January 27, 2025 02:27 PM Crime
ప్రియుడికి విషమిచ్చి చంపిన యువతికి మరణశిక్ష.. వీటి.ఆధారంగానే తీర్పు..

ప్రియుడికి విషమిచ్చి చంపిన కారణంతో 24 ఏళ్ల గ్రీష్మ అనే మహిళకు కేరళలోని సెషన్స్ కోర్టు మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. 2022లో గ్రీష్మ తన ప్రియుడికి షారోన్‌కు విషం ఇచ్చి హత్య చేసింది. ఈ కేసులో మరణ శిక్ష ప్రకటించే సమయంలో కోర్టు డిజిటల్ సాక్ష్యాధారాలను అంగీకరిస్తున్నట్లు తెలిపింది.

ఈ నేరాన్ని రుజువు చేసేందుకు పోలీసులు గూగుల్ క్లౌడ్ ద్వారా సేకరించిన డిజిటల్ సాక్ష్యాధారాలు కీలకం అయ్యాయి. ''ఫిజికల్ ఆధారాలు లేకపోవడంతో, ప్రాసంగిక సాక్ష్యం (సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్), డిజిటల్ సాక్ష్యాలను చూపించారు. ఈ సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, గ్రీష్మకు శిక్ష విధించింది'' అని ప్రభుత్వ ప్రాసిక్యూటర్ తెలిపారు.

తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన గ్రీష్మ, కేరళలోని పరసళై ప్రాంతానికి చెందిన షారోన్ రాజ్ ప్రేమించుకున్నారు. అప్పుడు గ్రీష్మ తల్లిదండ్రులు ఆమెకు మరో వ్యక్తితో సంబంధం కుదిర్చారు. ఆర్మీలో పనిచేసే వ్యక్తితో గ్రీష్మకు ఎంగేజ్‌మెంట్ కూడా అయింది. ఈ విషయాన్ని షారోన్ రాజ్‌కు చెప్పిన గ్రీష్మ, తనతో సంబంధాన్ని తెంచుకోవాలని కోరారు. కానీ, దానికి షారోన్ రాజ్ అంగీకరించలేదు.తన తల్లిదండ్రులు అంగీకరించిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని గ్రీష్మ నిర్ణయించుకుంది. దీన్ని షారోన్ రాజ్ వ్యతిరేకించాడు. షారోన్ అసలు వినలేదు. తన పెళ్లికి, భవిష్యత్‌లో తన వైవాహిక జీవితానికి షారోన్ రాజ్ అడ్డు పడతారని భయపడిన గ్రీష్మ, ఆయన్ను హత్య చేయాలని నిర్ణయించుకుంది. షారోన్ రాజ్‌ను ఇంటికి పిలిచి తినే ఆహార పదార్థంలో విషం కలిపి పెట్టి చంపేసింది. 


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: