ఇద్దరితో వివాహేతర సంబంధం.. చివరికి మృత్యు ఒడిలోకి..

Thursday, April 3, 2025 10:28 PM Crime
ఇద్దరితో వివాహేతర సంబంధం.. చివరికి మృత్యు ఒడిలోకి..

వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ప్రియురాలు మరొకరితో సంబంధం కలిగి ఉందనే కారణంతో ప్రియుడు ఆమెను బండరాయితో కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన చెన్నై శివారు పల్లావరం సమీపంలోని అనకాపుత్తూరులో చోటు చేసుకుంది. గౌరీ ఎవెన్యూ 2వ వీధికి చెందిన జ్ఞానసిద్ధన్‌ (40) నితను తాంబరం కార్పొరేషన్‌లో లారీ డ్రైవర్‌ గా పని చేస్తున్నాడు. 

అవివాహితుడు కావడంతో అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివసిస్తున్నాడు. అనకాపుత్తూరు అరుల్‌ నగర్‌ 3వ వీధికి చెందిన భాగ్యలక్ష్మి(33)తో ఇతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. భాగ్యలక్ష్మి అప్పటికే భర్తకు విడాకులు ఇచ్చి, తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటోంది. ఇద్దరూ తరచూ కలిసే వారు. ఈక్రమంలో భాగ్యలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని జ్ఞానసిద్ధన్‌ నిర్ణయించుకున్నాడు.

భాగ్యలక్ష్మికి జ్ఞానసిద్ధన్‌తో పాటు మరొకరితో సంబంధం ఉందని తెలిసింది. ఆగ్రహించిన జ్ఞానసిద్ధన్‌ బుధవారం ఉదయం భాగ్యలక్ష్మితో గొడవపడ్డాడు. పెద్ద బండరాయితో భాగ్యలక్ష్మి తలపై కొట్టాడు. భాగ్యలక్ష్మి సంఘటన స్థలంలోనే మృతిచెందింది. జ్ఞానసిద్ధన్‌ శంకర్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: