చదువుల్లో వెనకబడ్డారని ఇద్దరు పిల్లలను చంపేసి తండ్రి ఆత్మహత్య

Saturday, March 15, 2025 01:00 PM Crime
చదువుల్లో వెనకబడ్డారని ఇద్దరు పిల్లలను చంపేసి తండ్రి ఆత్మహత్య

చదువుల్లో వెనకబడ్డారని ఇద్దరు పిల్లలను చంపేసి తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కాకినాడ జిల్లా వాకలపూడిలో చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం చెందిన వానపల్లి చంద్రకిశోర్ కాకినాడ జిల్లా వాకలపూడిలోని ONGC ఆఫీస్‌లో అసిస్టెంట్ అకౌంటెంట్‌ గా పని చేస్తున్నారు. 

హోలీ పండుగ సందర్భంగా భార్య తనూజను, ఇద్దరు కుమారులు జోషిల్, నిఖిల్‌ను తీసుకుని తన ఆఫీస్‌కి వెళ్ళాడు. అనంతరం పిల్లలకు యూనిఫాం కొలతలు తీయించడానికి టైలర్ వద్దకు తీసుకెళ్తున్నానని చెప్పి, భార్యను ఆఫీస్‌లోనే ఉండమని నమ్మించి ఇంటికి వెళ్ళాడు. పిల్లల కాళ్లు, చేతులు కట్టేసి నిండా నీళ్లు ఉన్న బకెట్లలో తలలు ముంచి చంపేశాడు. ఆపై తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతసేపటికీ భర్త రాకపోవడంతో తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికి వెళ్లిన తనూజ కిటికీ నుంచి చూడగా భర్త, పిల్లలు విగతజీవులుగా కనిపించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తన పిల్లలు పోటీ పడలేక పోతున్నారని, చదవలేక పోతున్నారని, వారికి భవిష్యత్తు లేదని, అందుకే ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా చనిపోతున్నానని చంద్రకిశోర్ రాసిన సూసైడ్ నోట్ అందరినీ బాధిస్తోంది.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: