ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. కొన్ని గంటల్లోనే ఎన్ కౌంటర్
_(9)-1744643822.jpeg)
కర్ణాటకలో ఐదేళ్ల పాపను కిడ్నాప్ చేసి రేప్ చేసి చంపిన ఘటన కర్ణాటకలో సంచలనం సృష్టించింది. ఆదివారం (ఏప్రిల్ 12) ఉదయం హుబ్బలి ప్రాంతంలో పాపను చంపేసినట్లు తెలిసిన క్షణం నుంచి రాష్ట్రం మొత్తం అట్టుడికింది. నిందితుడిని వెంటనే శిక్షించాలని స్థానికులు తీవ్ర ఆందోళనలు చేశారు. ఈ కేసులో నిందితుడిని ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు చివరికి ఎన్ కౌంటర్ చేయడం సంచలనంగా మారింది.
పాపను మర్డర్ చేసిన వ్యక్తి బీహార్ కు చెందిన నితేశ్ కుమార్ (35) గా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న సమయంలో పోలీసులపైకి దాడికి దిగినట్లు అధికారులు తెలిపారు. ఆత్మరక్షణలో పోలీసులు నిందితుడిని ఎన్ కౌంటర్ చేసినట్లు తెలిపారు. నిందితుడిపై మర్డర్ కేసుతో పాటు పోక్సో కేసు కూడా నమోదైంది. ''నితేశ్ కుమార్ ను పోలీస్ టీమ్ అదుపులోకి తీసుకుని అతడి వివరాలను సేకరిస్తున్న తరుణంలో పోలీసులపై తిరగబడ్డాడు. ఆ సమయంలో పోలీస్ వెహికిల్ ను కూడా డ్యామేజ్ చేశాడు. ఆ టైమ్ లో పోలీసులు గాల్లోకి కాల్పులు జరపగా పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో అతడిపైకి రెండు రౌండ్ల కాల్పులు జరపాల్సి వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాం. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు'' అని హుబ్బలి పోలీస్ చీఫ్ శశి కుమార్ తెలిపారు.