ఇంటి ఓనర్ తో బెడ్ రూమ్ లో భార్య, తలుపు కొట్టిన భర్త, సీన్ కట్ చేస్తే
వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో చక్కగానే కాపురం చేసుకుంటూ వచ్చింది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. లారీ డ్రైవర్ అయిన భర్త నెలలో కొన్ని రోజులు ఇతర రాష్ట్రాల్లో తిరుగుతూ కొన్ని రోజులు ఇంటి దగ్గర ఉంటున్నాడు. దంపతులు వారి పిల్లలతో కలిసి అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. ఇంటి ఓనర్ డ్రైవర్ ఇంటికి వచ్చి వెలుతున్నాడు. ఇంటి అద్దె ఇస్తున్న సమయంలో, ఏదైనా ఇంట్లో సమస్య ఉన్న సమయంలో భార్య ఇంటి ఓనర్ తో మాట్లాడేది.రానురాను ఇంటి ఓనర్ తో ఎక్కువ చనువు పెంచుకున్న మహిళ అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె కోరికలు తీర్చుకోవడం మొదలు పెట్టింది. పని మీద వెలుతున్నానని, కొన్ని రోజులు ఇంటికి రానని భర్త అతని భార్యకు చెప్పి వెళ్లాడు. ఇంటి ఓనర్ ను ఇంటికి పిలిపించుకున్న డ్రైవర్ భార్య బెడ్ రూమ్ లో రొమాన్స్ చేస్తోంది. అదే సమయంలో ఇంటికి వెళ్లిన భర్త ఇంటి తలుపు కొట్టాడు. అంతే ప్రియుడు, భార్య కలిసి మద్యలో మా మూడ్ పాడ్ చేశాడని ఆమె భర్త మీద కొడవలి, కత్తులతో దాడి చెయ్యడం కలకలం రేపింది.