ఇంటర్ బాలికపై లెక్చరర్ ఘోరం.. రాజమండ్రిలో ఇంత దారుణమా?
Monday, February 3, 2025 03:31 PM Crime
_(8)-1738575268.jpeg)
పెళ్లి చేసుకుంటానని చెప్పి విద్యార్థినిపై లెక్చరర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది. రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఇంటర్ కళాశాల విద్యార్థినిపై ఇంగ్లీషు లెక్చరర్ విజయవర్ధన్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఇంటర్ సెకండియర్ చదువుతున్న మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. గత నెల 28న విద్యార్థినిని విజయవాడ తీసుకెళ్లి శారీరకంగా లోబర్చుకున్నాడు. అక్కడి నుంచి అనంతపురం, భీమవరం ప్రాంతాల్లో తిప్పి బాలికను ఇంటికి పంపించాడు. మోసపోయినట్లు గ్రహించిన విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: