మాధవి మర్డర్ కేసు : డీఎన్ఏ శాంపిల్స్ వచ్చేశాయి
హైదారాబాద్ లో రెండు రోజుల క్రితం గురుమూర్తి తన భార్యను చంపేసి, మృతదేహాన్ని ముక్కలు చేసి, ఉడికించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మాధవిని గురుమూర్తి హత్య చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. మాధవి మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చారు. క్లూస్ టీం ఇచ్చిన ఆధారాలతో గురుమూర్తిపై హత్యకేసు నమోదు చేశారు. క్లూస్ టీం సేకరించిన ఆధారాలను ఎఫ్ఎస్ఎల్కు పంపారు.
ఎఫ్ఎస్ఎల్కు శరీర టిష్యూ, వెంట్రుకలు, రక్తపు మరకలను పంపారు. డీఎన్ఏ మ్యాచింగ్ కోసం ఆధారాలు ఇచ్చారు. మాధవి పిల్లలు, తల్లి దగ్గర నుంచి ఎఫ్ఎస్ఎల్ శాంపిల్స్ సేకరించింది. కొన్ని గంటల్లో పోలీసులకు డీఎన్ఏ చేరనుంది. డీఎన్ఏ నివేదికతో గురుమూర్తిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
జనవరి 15న జిల్లెలగూడలోని తన ఇంట్లో భార్య మాధవిని గురుమూర్తి దారుణంగా ఈ హత్య చేశాడు. తన భార్యను చంపిన తర్వాత ఆమె ఆనవాళ్లు లేకుండా చేయాలని గురుమూర్తి ఈ విధంగా ప్రవర్తించాడు.