అమ్మ ఎక్కడ నాన్న అని అడిగిన పిల్లలు.. గుర్తుమూర్తి ఏం చెప్పాడు?
హైదరాబాద్ లో మాజీ ఆర్మీ జవాన్ గురుమూర్తి తన భార్యను దారుణంగా హత్యచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు నిందితుడు గురుమూర్తిని విచారిస్తున్నారు.
గురుమూర్తి పిల్లలు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు.. పండుగ తరువాత ఇంటికి రాగానే దుర్వాసన వచ్చిందని గురుమూర్తి కూతురు పోలీసులకు తెలిపింది. ఇంటికి రాగానే ''అమ్మ ఎక్కడ నాన్న అని అడిగాను.. కానీ, నాన్న మౌనంగా ఉన్నాడు. ఏమీ చెప్పలేదు'' అని పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో గురుమూర్తి కుమార్తె పేర్కొంది. ఇదిలా ఉంటే. మాధవి హత్య చేశానని పోలీసుల ముందు గురుమూర్తి ఒప్పుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆమెను చంపిన విధానంపై పోలీసులకు రెండు మూడు వెర్షన్స్ లో గురుమూర్తి చెబుతున్నట్లు తెలిసింది.
గురుమూర్తి తన ఇంటి బాత్ రూమ్ లోనే మాధవి మృతదేహాన్ని కత్తితో ముక్కలు ముక్కలు చేశానని, రక్తపు మరకలు కనిపించకుండా సుమారు పది సార్లు కడిగినట్లు గురుమూర్తి చెప్పాడు. అయితే, గురుమూర్తి పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. గురువారం రాత్రి కూడా గురుమూర్తిని మరోసారి ఎముకల పొడిని కలిపిన చెరువు దగ్గరికి తీసుకెళ్లారు. అయినా కూడా ఎలాంటి ఆనవాళ్లు లభ్యం కాలేదు.
బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ
See Full Gallery Here...