ప్రియుడి కోసం ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన తల్లి

ప్రియుడితో కలిసి ఉండాలని ముగ్గురు పిల్లలకు కన్న తల్లే విషమిచ్చి చంపిన దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్‌లో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా రజిత(45) పిల్లలని చంపేయాలని ప్లాన్ చేసింది. ఇటీవల 10th క్లాస్ విద్యార్థుల గెట్ టూ గెదర్ పార్టీలో స్నేహితుడితో రజితకి పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.
గత నెల 27న రాత్రి భోజనం చేసేటప్పుడు పెరుగులో విషపదార్థం కలిపింది. భర్త చెన్నయ్య పని నిమిత్తం బయటకు వెళ్ళాడు. తర్వాత రజిత పిల్లలకు పెరుగన్నం పెట్టింది. అర్ధరాత్రి రెండు గంటలకు చెన్నయ్య ఇంటికి వచ్చేసరికి ముగ్గురు పిల్లలు సాయికృష్ణ(12), మధు ప్రియ(10), గౌతమ్(08) విగతజీవులుగా పడి ఉన్నారు. కడుపు నొప్పిగా ఉందని భార్య రజిత చెప్పడంతో భర్త చెన్నయ్య ఆస్పత్రిలో చేర్చాడు. మొదట భర్త చెన్నయ్యపై పోలీసులు అనుమానం వ్యక్తం చేసారు. విచారణలో రజిత బాగోతం బయట పడింది. రజిత టెన్త్ క్లాస్ ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.