భార్యను ముక్కలుగా నరికి.. కుక్కర్ లో ఉడకబెట్టి.. ఎముకలు పొడిచేసి.. ఎందుకిలా చేశాడంటే?

Thursday, January 23, 2025 05:42 PM Crime
భార్యను ముక్కలుగా నరికి.. కుక్కర్ లో ఉడకబెట్టి.. ఎముకలు పొడిచేసి.. ఎందుకిలా చేశాడంటే?

హైదరాబాదులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యను ముక్కలుముక్కలుగా నరికి చంపేశాడు. సాక్ష్యాలు దొరకకుండా భార్య శవాన్ని మాయం చేశాడు. ఇప్పటి వరకూ ఎన్నో మిస్టరీలు చూసుంటాం కానీ.. మిస్టరీని చేధించిన పోలీసులకే ఈ కేసు ఎలా క్లోజ్ చేయాలో అర్థం కాకుండా చేశాడు.

రిటైర్డ్ ఆర్మీ అధికారి అయిన తాను భార్య మీద అనుమానంతో పలుమార్లు గొడపడ్డాడు. ఈ క్రమంలో భార్యను చంపేసి మటన్ కోసే కత్తులతో శరీరాన్ని ముక్కలుముక్కలుగా నరికి.. ఆపై తన భార్య మాంసం ముద్దలను ప్రెజర్ కుక్కరులో మరియు బకెట్ లో వేసి హీటర్ ద్వారా రోజంతా ఉడికించాడు. ఉడికిన శరీర భాగాలను డ్రైనేజీలో పడేశాడు. ఎముకలను ఇంట్లోనే కాల్చేసి పొండిచేసి ఆ పొడిని చెరువులో కలిపేశాడు. ఈ దారుణ ఘటన ఈనెల 16న జరగగా.. బుధవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది.. అయితే, పోలీసులు భర్తను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం చేసింది అతనే అని నిర్ధారణకు వచ్చారు. అయితే, అతడే నేరం చేశాడని చెబుతున్నప్పటికీ.. చనిపోయింది అతని భార్యేనని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో పోలీసులకు ఈ కేసు సవాల్ గా మారింది.

ఇవాళ సోషల్ మీడియాలో రచ్చలేపుతున్న టాప్ హాట్ ఫోటోస్ ఇవే - గ్యాలరీ 1

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: