2 కుక్కర్లు.. 72 గంటలు.. మాధవి మర్డర్ కేసులో విస్తుపోయి నిజాలు

Friday, January 24, 2025 11:34 AM Crime
2 కుక్కర్లు.. 72 గంటలు.. మాధవి మర్డర్ కేసులో విస్తుపోయి నిజాలు

హైదారాబాద్ లో చోటుచేసుకున్న కుక్కర్ మర్డర్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. భార్యను అతి కిరాతకంగా చంపిన దారుణ ఘటనలో విస్తుపోయే నిజాలు బయట పడుతున్నాయి.

నిందితుడు గురుమూర్తి భార్య, పిల్లలతో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు వెళ్లారు. సినిమా నుంచి వస్తుండగా గురుమూర్తికి, భార్య వెంకట మాధవికి ఓ చిన్న గొడవ జరిగింది. ఇంటికి వచ్చాక ఆ గొడవ కాస్త ముదిరింది.

ఆ క్రమంలో కోపంతో భార్యను గోడకేసి కొట్టడంతో ఆమె చనిపోయింది. శవాన్ని ఎలాగైనా మాయం చేయాలని గురుమూర్తి స్కెచ్ వేశాడు. శవాన్ని కత్తితో ముక్కలు చేసి, కుక్కర్లో వేసి ఉడికించాడు. ఎముకలను పొడి చేశాడు. వాటిని కవర్లో వేసి ఇంటి దగ్గర ఉన్న ఓ చెరువులో పడేశాడు. అనుమానం కారణంగానే ఇలా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎవరికి ఎలాంటి డౌట్ రాకుండా భార్యను చంపేసి, అత్తవారికి కనిపించడం లేదని తెలిపాడు. రంగంలోకి దిగిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. సినిమా నుంచి వచ్చిన తర్వాత మాధవి ఇంట్లోకి వెళ్లింది. కానీ తిరిగి బయటకు వెళ్లలేదని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. కనీసం బయటకు కూడా రాలేదు. ఇంటి నుంచి బయటకు వెళ్లే అవకాశం కూడా లేదు.

దీంతో పోలీసులకు అనుమానం వచ్చి.. భర్త గురుమూర్తిని విచారించారు. ఆ క్రమంలో పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. భార్యను తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. మటన్ కోసే కత్తితో ఆమెను దుంగపై ముక్కలుగా కోశాడు. 2 కుక్కర్ లలో 72 గంటల పాటు ఊడికించాడు. హీటర్ ద్వారా కూడా మాంసాన్ని ఉడికించి, ఆ తర్వాత పొడి తయారు చేశాడు. దీన్ని ఇంటి దగ్గర ఉన్న చెరువులో పడేశాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆమెను ప్లానింగ్ మీద చంపాడు. 

ఇవాళ సోషల్ మీడియాలో రచ్చలేపుతున్న టాప్ హాట్ ఫోటోస్ ఇవే - గ్యాలరీ 1

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: