ఏవండీ.. మీ ఫ్రెండ్ నైట్ అంతా మన ఇంట్లో పడుకున్నాడు

తల్లిదండ్రులు ఊరెళ్ళిన సమయంలో తండ్రి స్నేహితుడు రాత్రంతా ఇంట్లోనే నిద్రించాడు.. కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం తండ్రికి చెప్పినా పట్టించుకోలేదు. దీంతో ఆ యువతి తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన బంజారాహిల్స్‌లో వెలుగులోకి వచ్చింది.
బంజారాహిల్స్ రోడ్ నం.5లోని ఓ బస్తీలో నివసించే భార్యాభర్తలు తమ 14 ఏళ్ల కూతురితో పాటు మిగతా ఇద్దరిని ఇంట్లోనే వదిలేసి ఈనెల 17వ తేదీన మహబూబ్‌నగర్‌కు వెళ్లారు. రాత్రి ఆమె భర్త స్నేహితుడు మోహన్‌సింగ్, సోను బాధితురాలి ఇంటికి వచ్చారు. ఇంట్లోనే మద్యం సేవించారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో నిద్రిస్తున్న బాలిక(14) గదిలోకి వెళ్లిన సోను ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నోరు నొక్కి అక్కడే పడుకున్నాడు. ఆమె అరవడానికి ప్రయత్నించగా బెదిరించాడు. తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చిన తల్లికి బాలిక జరిగిన విషయాన్ని చెప్పింది. ఇదే విషయాన్ని బాధిత తల్లి తన భర్తకు చెప్పింది. వచ్చింది నా స్నేహితుడే కదా అంటూ భర్త నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో బాధితురాలు తన కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మోహన్‌సింగ్, సోనుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.