సోషల్ మీడియా పరిచయం.. భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో జంప్..
Sunday, March 2, 2025 02:00 PM Crime

భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో ఓ వివాహిత పారిపోయింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పేట్ బాషీరాబాద్ పీయస్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతనెల 5న తన భార్య సుకన్య(35) కనిపించడం లేదంటూ భర్త జయరాజ్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు.
భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచమైన గోపి(22)అనే వ్యక్తితో సుకన్య వెళ్లిపోయింది. తన భార్య, ప్రియుడు బైక్‌పై వెళ్తున్నారని తెలిసి, ఫాలో అయి మేడ్చల్ ఆక్సిజన్ పార్క్ వద్ద భర్త జయరాజ్ పట్టుకున్నాడు. ఈ తరుణంలోనే గోపి, సుకన్య బైక్‌ను వదిలేసి రన్నింగ్ బస్సు ఎక్కి పరాయ్యారు. అనంతరం పీఎస్‌కు వెళ్లి జయరాజ్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: