వీడియో ఇదిగో, పెళ్లికి నిరాకరించిందని యువతి తల్లిపై యువకుడు దాడి

Monday, March 3, 2025 11:23 AM Crime
వీడియో ఇదిగో, పెళ్లికి నిరాకరించిందని యువతి తల్లిపై యువకుడు దాడి

తెలంగాణలో దారుణ ఘటన వెలుగుచూసింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారంలో ప్రేమించిన యువతితో పెళ్లికి నిరాకరించారనే ఆగ్రహంతో ఓ యువకుడు ఆమె తల్లిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ అనే యువకుడు ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని ఆమెను వెంటాడుతున్నాడు. అయితే, ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లి కుమార్తెకు వేరే వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిర్చింది. దీంతో కోపోద్రిక్తుడైన రాజ్‌కుమార్ యువతి తల్లిపై అమానుషంగా దాడి చేసి, ఆమె గొంతు నులిమి హత్యకు యత్నించాడు. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను రక్షించారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: