అతనికి 21.. ఆమెకు 31.. చివరకు ఏమైందంటే..
అతనికి 21 ఏళ్లు..ఆమెకు 31 ఏళ్లు..ఆమె వివాహిత, అతనికి పెళ్లి కాలేదు.. ఇద్దరూ వివాహేతర సంబంధంలో ఉన్నారు. ఏమి జరిగిందో ఏమో ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పద్మనాభం మండలంలోని కృష్ణాపురంలో చోటు చేసుకుంది. కృష్ణాపురం గ్రామానికి చెందిన కనకల లక్ష్మి(31) తన ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని మృతి చెందగా అదే గ్రామానికి చెందిన మొకర ఆదిత్య(21) స్ప్రింగ్ ఫీల్డ్ పాఠశాల వెనుక ఉన్న షెడ్‌లో చీరతో ఉరివేసుకొని మృతి చెందాడు. వీరి మధ్య కొన్నాళ్లగా వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. మృతుడు ఆదిత్య తండ్రి రవి, మృతురాలు లక్ష్మి భర్త శంకర్ ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
మొకర రవి, జానకి దంపతులకు ఆదిత్య ఒక్కగానొక్క కొడుకు. విశాఖ నగరంలో ఉద్యోగం చేస్తున్నాడు. కొడుకు మృతితో తల్లి దండ్రులతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. నకల శంకర్, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో తేజేష్ 4వ తరగతి, ధను 2వ తరగతి చదువుతున్నారు. లక్ష్మి మృతితో ఇద్దరు చిన్నారులు తల్లి ప్రేమకు దూరమయ్యారు. తల్లి మృతదేహం వద్ద ఈ చిన్నారులు బిక్కుబిక్కుమంటూ చూస్తున్న చూపులు అందరిని కలచివేశాయి.