పిల్లలిద్దరూ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నారు.. డిప్రెషన్ లోకి యాక్టర్ చిన్నా

నటుడు చిన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వచ్చిన సెన్సేషన్ మూవీ శివ సినిమాతో చిన్నా వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమాలో నాగార్జున ఫ్రెండ్ గా నటించి మెప్పించాడు. ఇక కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన ఆయన.. కల్యాణమాల అనెన్సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అల్లరి పిల్ల అనే సినిమాలో ఆయన నటనకు వంశీ బెర్క్లీ అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో చిన్న ప్రత్యేక పాత్రల్లో కనిపించాడు. కేవలం నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా కూడా పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు.
చిన్నా దర్శకత్వంలో వచ్చిన ఆ ఇంట్లో అనే హర్రర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం చిన్నా అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నాడు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా సీరియల్స్ లో కూడా నటిస్తున్నాడు. జీ తెలుగులో ప్రసారం అవుతున్న నిండు నూరేళ్ళ సావాసం సీరియల్ లో హీరోయిన్ తండ్రిగా నటిస్తున్నాడు. ఇక అప్పుడప్పుడు యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇచ్చే చిన్నా తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని చెప్పుకొచ్చారు.
చిన్నా అసలు పేరు జితేందర్రెడ్డి అని, తనకు కులమత బేధాలు లేవని.. రెడ్డి అని పిలిపించుకోవడం ఇష్టంలేక చిన్నా అనే పేరుతో కొనసాగుతున్నట్లు తెలిపాడు. ఇక తన జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఉన్నాయో తెలిపాడు. భార్య చనిపోయినప్పుడు చాలా డిప్రెషన్ ఫీల్ అయ్యానని, తన ఇద్దరు కూతుళ్లు ప్రేమ పెళ్లిళ్లు చేసుకొని వెళ్ళిపోయినప్పుడు చాలా బాధపడ్డాడు. తన భార్య చనిపోయినప్పుడు నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానని,cకొన్ని నెలల పాటు చీకటి గదిలోనే ఉండిపోయాను. ఆ తరువాత ఇది కాదు జీవితం అనిపించింది. షూటింగ్స్ వలన నేను కోలుకున్నాను. వరుస షూటింగ్స్ లో బిజీగా మారాను. కొన్ని కొన్ని తలుచుకున్నప్పుడు బాధగా అనిపించేది ఏంటంటే.. ఆడపిల్లలు అవ్వడం వలనే కొంచెం ఎక్కువ బాధగా ఉండేది. ఎందుకంటే నాతో కంటే వాళ్ళ అమ్మతోనే అన్ని చెప్పుకొనేవారు.
ఇద్దరు పిల్లలది లవ్ మ్యారేజే. పెద్ద పాపకు పెళ్లి చేసే సమయంలో నా భార్య బతికే ఉంది. ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు.. నా భార్యను, అత్తగారిని పిలిచి.. ఇలా సంబంధాలు చూస్తున్నాను.. పాపకు ఇష్టమా.. ? లేక ఎవరైనా ఉన్నారా.. ? అని అడగండని చెప్పాను. వారు అడిగినప్పుడు నా పెద్ద కూతురు తాను ఒక చౌదరి అబ్బాయిని ప్రేమించినట్లు చెప్పింది. కొద్దిసేపు నాకు డైజిస్ట్ కాలేదు. నేను పెంచిన విధానంలో నా పిల్లలు ఇలా ఉండరు అనుకున్నాను. కానీ, జనరేషన్ మారింది.
క్యాస్ట్ తో నాకు సంబంధం లేదు. అందరూ నా కూతురుతో మాట్లాడమని చెప్పారు. నేను వెంటనే మాట్లాడలేదు.దీంతో మా పాప భయపడిపోయింది. ఇక నేను, నా భార్య కూర్చొని ఒకరోజు మాట్లాడాము. పెళ్లి తరువాత నాన్న.. ఇలా జరిగింది.. అలా జరిగింది అని అనకుండా ఉండేలా ఉంటే పెళ్లి చేసుకోండి అన్నాను. అంతేకాకుండా నాలా లేడు అని అనుకోవద్దు. నాన్న, అమ్మను చూసుకున్నట్లు నా భర్త నన్ను చూసుకోవడం లేదు అని అనుకోవద్దు. అది నా మెంటాలిటీ.. ఇంకొకడికి ఇంకొక మెంటాలిటీ ఉంటుంది. ఇదే చెప్పాను. ఇద్దరిది లవ్ మ్యారేజే.. ఇద్దరినీ అంగీకరించాం. రెండో అమ్మాయిది ఈ మధ్యనే పెళ్లి అయ్యింది.
చిన్న అల్లుడు బ్రాహ్మిణ్. ఒకటే అడిగా.. మూడు పూటలు నాన్ వెజ్ తింటావుగా.. అక్కడ ఎలా మరీ అంటే.. ఆయన కూడా నాన్ వెజ్ తింటారు అని చెప్పింది. ఓకే అని పెళ్లి చేశాను. ఇప్పుడు అందరూ హ్యాపీ. అల్లుళ్ళు నాతో మంచిగానే ఉంటారు. ఎక్కువ మాట్లాడరు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.