కొడుకు చనిపోయాడని పోస్టు పెట్టిన హీరోయిన్ త్రిష
Saturday, December 28, 2024 05:57 PM Entertainment
హీరోయిన్ త్రిష కొడుకు చనిపోయాడని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. "ఈ రోజు నా కొడుకు జోరో చనిపోయాడు, నేను నా కుటుంబం షాకులో ఉన్నాం.." అని హీరోయిన్ త్రిష ట్విట్టర్ (X) వేదికగా అభిమానులతో పంచుకుంది.
ఈ పోస్టు చదివి కంగుతిన్న అభిమానులు, మీకు పెళ్లైందా..? కొడుకు ఎప్పుడు పుట్టాడు..? అని ఆరా తీశారు. ఆ తర్వాత త్రిష తన పెంపుడు కుక్క చనిపోయిందని ఆ ఫోటోలు షేర్ చేసింది. త్రిష చెప్పిన కొడుకు పెంపుడు కుక్క అని తెలియడంతో ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా.. ఇంత గందరగోళం ఎందుకు అని నెటిజన్లు ఫైర్ అయ్యారు.
For All Tech Queries Please Click Here..!
Topics: