20 ఏళ్ల అబ్బాయితో చేస్తే తప్పేంటి? అది చాలా అవసరం! అనసూయ ఊర మాస్!!

Tuesday, February 25, 2025 01:50 PM Entertainment
20 ఏళ్ల అబ్బాయితో చేస్తే తప్పేంటి? అది చాలా అవసరం! అనసూయ ఊర మాస్!!

మొహమాటం లేకుండా మాట్లాడే యాంకర్, సినీ నటి అనసూయ మరో సారి హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల జరిపిన ఓ సర్వే ప్రకారం 20-25 ఏళ్ల అబ్బాయిలు 35ఏళ్ల ఆంటీలను కోరుకుంటున్నారట. వారిపై క్రష్ పెంచుకుంటున్నారట.. దీనిపై మీ అభిప్రాయం ఏమిటని అనుసూయను అడగ్గా అందులో తప్పేముందని అనసూయ సమాధానం ఇచ్చారు. ఫుడ్, షెల్టర్, క్లాత్ ప్రాథమిక అవసరాలని, శృంగారం కూడా ప్రాథమిక అవసరమే అని చెప్పారు.

పరోక్షంగా ప్రతి ఒక్కరు తమ కోరికలను తీర్చుకోవాలని, ఈ విషయంలో వయసు అడ్డుకాదని చెప్పారు. డ్రెస్సింగ్ పై కామెంట్స్ చేసే వాళ్లకు మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "నేను బికినీ వేసినా, బట్టలు విప్పి తిరిగినా అది నా ఇష్టం. మీరు మనుషులు కాదా? ఇద్దరు పిల్లల తల్లి బికినీ వేసిందని ఆలోచించే వాళ్ళను మీరు తప్పుబట్టాలి" అని తెలిపారు. ఎవడో కోన్ కిస్కా గొట్టం గాడి కోసం మన ఇష్టాలు మార్చుకోవాలా అని వ్యాఖ్యలు చేశారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: