మూడో సారి పెళ్లి పీటలెక్కనున్న బాలీవుడ్ సూపర్ స్టార్

Sunday, February 2, 2025 12:17 PM Entertainment
మూడో సారి పెళ్లి పీటలెక్కనున్న బాలీవుడ్ సూపర్ స్టార్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మూడో సారి పెళ్లి చేసుకోనున్నారు. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అమీర్ కొంతకాలంగా బెంగళూరుకు చెందిన ఓ మహిళతో సంబంధంలో ఉన్నాడు. ఆమెను అమీర్ త్వరలో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అమీర్ ఇటీవల తన ప్రియురాలిని తన కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేశాడట. వారి పెళ్లికి పెద్దల ఆశీర్వాదం కూడా పొందినట్లు సమాచారం. అయితే ఈ వివాహానికి సంబంధించి అభిమానులు అమీర్ నుండి అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. 

అమీర్ మొట్టమొదట తన చిన్ననాటి ప్రేయసి రీనా దత్తాను 1986లో వివాహం చేసుకున్నాడు. ఆ జంటకు జునైద్ ఖాన్, కుమార్తె ఇరా ఖాన్ ఉన్నారు. 2002లో వారు విడాకులు తీసుకున్నారు. తరువాత అమీర్ కిరణ్ రావుతో ప్రేమలో పడ్డాడు. 2006లో ఆమెను వివాహం చేసుకున్నాడు. వారికి కుమారుడు ఆజాద్ రావు ఖాన్ సర్రోగసీ ద్వారా జన్మించినట్లు ప్రకటించారు. కిరణ్ రావుతో జూలై 2021లో అమీర్ విడిపోయారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: